విజయ్‌కు నీరా‘జనం’
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:35 AM
చెన్నై నగరంలోని విల్లివాక్కం, విరుగంబాక్కం, కొళత్తూరు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు.
ఒకే రోజు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్‌షో
చెన్నై: చెన్నై నగరంలోని విల్లివాక్కం, విరుగంబాక్కం, కొళత్తూరు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు. ఆయనకు ప్రజలు, అభిమానులు నీరాజనం పలికారు. ముందుగా విరుగంబాక్కం నియోజకవర్గ అభ్యర్థి శబరికి మద్దతుగా వడపళని, అశోక్‌నగర్, ఎంజీఆర్ నగర్ ప్రాంతాల్లో రోడ్‌షోలో పాల్గొన్న విజయ్‌పై ఆయన అభిమానులు, పార్టీ శ్రేణలు, స్థానికులు పూలుచల్లి విజిల్ ఊదుతూ స్వాగతించారు. ఆ తర్వాత విల్లివాక్కం నియోజకవర్గ అభ్యర్థి ఆదవ్ అర్జునకు మద్దతుగా విజయ్ ఐసీఎఫ్, అనైనగర్, రాజమంగళం, మదర్ థెరిస్సా నగర్, విల్లివాక్కం ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్నారు.
మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా విజయ్‌ను చూడాలని చిన్నారులు, మహిళలు గంటల తరబడి వేచివుండటంతో కొంతమంది ఉక్కపోత భరించలేక సొమ్మసిల్లి పడిపోయారు. ప్రచార వాహనంపై నిల్చున్న విజయ్ రోడ్డుకిరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. విజయ్ ప్రచారం వల్ల పాడి, మన్నూర్‌పేట, అన్నానగర్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ వార్తలు కూడా చదవండి:
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ఎక్స్ వేదికగా భారత ఆర్మీ ట్వీట్..
పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత
Read Latest Telangana News and National News