Share News

కాకిని కొనుక్కొచ్చి.. పిండాన్ని ముట్టించి..

ABN , Publish Date - Apr 21 , 2026 | 07:54 AM

హైదరాబాద్ పాతబస్తీ పురానాపూల్‌ శ్మశానవాటికలో ఆదివారం జరిగిన ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హిందూ శ్మశానవాటికలో చనిపోయిన తమ వ్యక్తికి కొందరు కర్మకాండలు జరిపించి పిండం పెట్టారు.

కాకిని కొనుక్కొచ్చి.. పిండాన్ని ముట్టించి..
Crows, Puranapul, Hyderabad

  • పురానాపూల్‌ శ్మశానవాటికలో ఆసక్తికర ఘటన

హైదరాబాద్: పాతబస్తీ పురానాపూల్‌ శ్మశానవాటికలో ఆదివారం జరిగిన ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హిందూ శ్మశానవాటికలో చనిపోయిన తమ వ్యక్తికి కొందరు కర్మకాండలు జరిపించి పిండం పెట్టారు. కానీ ముట్టడానికి కాకులు రాలేదు. గంటల తరబడి ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో సమీపంలో ఉన్న ముర్గీచౌక్‌కు వెళ్ళి కాకిని కొనుక్కుని వచ్చారు. దాని కాళ్లను దారంతో కట్టి ఆహారం, నీళ్ళు అందించిన తర్వాత పిండాన్ని ముట్టించారు. ఈ సంఘటనను తిలకించిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.


city3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

కాళేశ్వరంపై ఎలా ముందుకెళదాం?

Read Latest Telangana News and National News

Updated Date - Apr 21 , 2026 | 07:54 AM