Share News

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:57 AM

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అభలోడ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత
Gujarat Food Poisoning

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అభలోడ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు 400 మందికి పైగా అతిథులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో అబ్లోద్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


అభలోడ్ గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. వేడుక అనంతరం ఏర్పాటు చేసిన విందును ఆరగించారు. భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. విందులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

1805 కోట్ల ఉపాధి నిధులు విడుదల

Updated Date - Apr 21 , 2026 | 11:03 AM