Share News

నేటితో ప్రచారం పరిసమాప్తం

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:05 AM

గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్‌ జరుగనుంది.

నేటితో ప్రచారం పరిసమాప్తం
Tamil Nadu, elections

  • 23న పోలింగ్‌కు ఏర్పాట్లు

చెన్నై: గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్‌ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. డీఎంకే - కాంగ్రెస్‌ సారథ్యంలోని ‘ఇండి’ కూటమి, అన్నాడీఎంకే - బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, తమిళగ వెట్రి కళగం (టీవీకే), నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని పార్టీల నేతలు గత కొన్ని రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేశారు.


తుదిదశ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పియూష్‌ గోయల్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు కూడా తమ మిత్రపక్ష పార్టీలకు ప్రచారం చేశారు. ఇదిలావుండగా ఈ నెల 23వ తేదీన జరుగనున్న పోలింగ్‌కు ఈసీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.


nani1.2.jpgరాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లుండగా, 234 స్థానాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 75,064 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం 295 కంపెనీల పారామిలిటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. ఎన్నికల కోసం ప్రభుత్వ ఉద్యోగులులతో కలిసి మొత్తం 4.74 లక్షల మంది పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ఎక్స్ వేదికగా భారత ఆర్మీ ట్వీట్..

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

Read Latest Telangana News and National News

Updated Date - Apr 21 , 2026 | 11:05 AM