దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Apr 21 , 2026 | 09:41 AM
కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసులు లోతుగా విచారణ చేస్తూ కేసును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు.
కడప, ఏప్రిల్ 21: నగరంలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసులు లోతుగా విచారణ చేస్తూ కేసును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. హత్య వెనుక ఉన్న కారణాలను బయటపెట్టడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దస్తగిరి హత్యతో సంబంధం ఉన్న వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిత్యానంద రెడ్డిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి విచారించాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
హతుడు పెద్దదస్తగిరి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో వైసీపీ నేతలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 145 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఈ భూముల మొత్తం విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి నివాసంలో గత రాత్రి నాలుగు గంటల పాటు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు చేపట్టిన విచారణతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
జనరల్ స్టోర్‌లో చోరీ.. పోలీసులను ఆశ్రయించిన యజమాని
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన రైలు.. రైతుకు తీవ్రగాయాలు..
Read Latest AP News And Telugu News