జనరల్ స్టోర్‌లో చోరీ.. పోలీసులను ఆశ్రయించిన యజమాని
ABN , Publish Date - Apr 21 , 2026 | 09:17 AM
బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం తిరుపతమ్మ గుడి సెంటర్ సమీపంలోని సత్య జనరల్ స్టోర్‌లో సోమవారం అర్థరాత్రి చోరీ జరిగింది. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన షాపు ఓనర్ టి. సత్యకుమార్ వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు.
గన్నవరం, ఏప్రిల్ 21: బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం తిరుపతమ్మ గుడి సెంటర్ సమీపంలోని సత్య జనరల్ స్టోర్‌లో సోమవారం అర్థరాత్రి చోరీ జరిగింది. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన షాపు ఓనర్ టి. సత్యకుమార్ వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. దాదాపు రూ. 2 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన షాపును పోలీసులు పరిశీలించారు.
షాపు షట్టర్ తాళాలు పగలకొట్టడానికి ఉపయోగించి ఇనుపరాడ్లు, పలుగు తదితర వస్తువులు చోరీ జరిగిన ప్రాంతంలోనే దొంగలు వదిలి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనరల్ స్టోర్ పరిసర ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి
For More National News And Telugu News