బెంగాల్‌లో బీజేపీదే పైచేయి
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:22 AM
పశ్చిమ బెంగాల్‌లో 167 స్థానాల వరకు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజాపోల్ అనలిటిక్స్ (పీపీఏ) సంస్థ పేర్కొంది.
పీపీఏ విశ్లేషణ సంస్థ అంచనా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లో 167 స్థానాల వరకు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజాపోల్ అనలిటిక్స్ (పీపీఏ) సంస్థ పేర్కొంది. తమిళనాడులో డీఎంకే 117 సీట్లను గెలుచుకుంటుందని, మిత్రపక్షాలతో కలిసి 150 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిపింది. గతేడాది జరిగిన బిహార్‌లో తమ అంచనాలు నూటికి నూరుశాతం ఫలించాయని సంస్థ అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు బీజేపీ 167 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 126 సీట్లు, ఇతరులు ఒక సీటు గెలుస్తారని తమ సంస్థ మెగాసర్వే ఫలితాలు చెబుతున్నాయన్నారు. ఇక తమిళనాడులో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌కు 150 స్థానాలు లభిస్తాయని తెలిపారు. వాటిలో డిఎంకె 117, కాంగ్రెస్ 16, డిఎండికె 7, విసికె 4, సిపిఐ 3, సిపిఐ(ఎం) 2 సీట్లు సాధిస్తాయని పిపిఏ తెలిపింది. ఎన్డీఏలో అన్నాడిఎంకెకు 53, బిజెపికి 9, పిఎంకెకు 7, ఎఎంఎంకెకు ఒక సీటు లభిస్తుందని ఈసంస్థ అంచనా వేసింది.