Share News

ఉప ఎన్నికల్లో సీఎం నాలుగు రోజుల ప్రచారం

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:01 PM

టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌ తారాపురం, మధురాంతకం నియోజకవర్గాల్లో రెండు రోజుల చొప్పున పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

ఉప ఎన్నికల్లో సీఎం నాలుగు రోజుల ప్రచారం
CM Vijay

చెన్నై: టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌ తారాపురం, మధురాంతకం నియోజకవర్గాల్లో రెండు రోజుల చొప్పున పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ రెండు చోట్లా టీవీకే గెలిచి తమ ప్రభుత్వానికి ప్రజలంతా గట్టి మద్దతు ఇస్తున్నారని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుకనే టీవీకే నేత ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాలుగు రోజులపాటు ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. రెండు చోట్లా టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, ఎన్టీకే పార్టీలు పోటీ చేస్తున్నాయి.


దీనితో రెండు నియోజకవర్గాల్లోనూ పంచముఖ పోటీ నెలకొంది. మధురాంతకంలో టీవీకే తరఫున మరగతం కుమారవేల్‌, డీఎంకే నుంచి పరంథామన్‌, అన్నాడీఎంకే అభ్యర్థిగా గణితా సంపత్‌, సీపీఎం తరఫున సుగంధి, ఎన్టీకే నుంచి జానకిరామన్‌ పోటీ చేస్తున్నారు. తారాపురం లో టీవీకే అభ్యర్థిగా సత్యభామ, డీఎంకే నుంచి సుకన్య, అన్నాడీఎంకే అభ్యర్థిగా భానుమతి, సీపీఐ తరఫున లక్ష్మణన్‌, ఎన్టీకే తరఫున కార్తీక పోటీ చేస్తున్నారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడనుంది.


nani1.2.jpgదీంతో ఈ నెల 20 తర్వాత అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేయనున్నారు. ఈ పరిస్థితులలో టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌ మధురాంతం, తారాపురం నియోజకవర్గాల్లో తలా రెండు రోజుల చొప్పున ప్రచారం చేయనున్నారు. తారాపురంలో ఈ నెల 25న, అక్టోబరు 2న విజయ్‌ ప్రచారం చేయనున్నారు. ఇదే రీతిలో డీఎంకే అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నేతలు స్టాలిన్‌, ఉదయనిధి కూడా రెండు నియోజకవర్గాల్లో రెండు రోజుల చొప్పున ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మధురాంతకం నియోజకవర్గంలో ఈ నెల 25, 26 తేదీల్లో అక్టోబరు 3న ప్రచారం చేయనున్నారు. ఇదే విధంగా తారాపురంలోనూ రెండు రోజులపాటు ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌, సీపీఎం రాష్ట్ర కమిటి కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వీరపాండియన్‌ కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నందిగ్రామ్ ఉపఎన్నిక.. కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్..

రోడ్డు కావాలని అడిగిన ప్రజలు.. కేంద్ర మంత్రి సింధియా రియాక్షన్ వైరల్..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 01:01 PM