మహిళలకు నెలకు రూ.2000
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:55 PM
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.
రాష్ట్ర ఉత్సవంగా ‘తైపూసం’
కేంద్రమంత్రి జేపీ నడ్డా
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
చెన్నై: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. మహిళలకు నెల రూ.2వేలు ఇస్తామని, అలాగే తమిళ సంప్రదాయ పండుగ తైపూసం ను రాష్ట్ర ఉత్సవంగా జరుపనున్నట్లు ప్రకటించారు. గిండిలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరై బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబబాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలందరికి ప్రతినెలా రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు యేడాదికొకమారు ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొంగల్, తమిళ ఉగాది, దీపావళి సమయంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను పూర్తిస్థాయిలో అడ్డుకునేలా ‘జీరో-ఎ్‌ఫఐఆర్’ విధానాన్ని ప్రవేశపెట్టనున్న ట్లు తెలిపారు.
బాధితుల తరుఫున న్యాయస్థానా ల్లో సాక్ష్యం చెబుతున్నవారికి భద్రతకల్పించడంతో పాటు లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల విచారణల నిమిత్తంప్రత్యేక ఫాస్ట్‌కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయస్థానాలు, బస్సులు, పాఠశాలలు, కళాశాలల్లో ‘నిర్భయనిధి’ తో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల నేతృత్వంలో పనిచేస్తున్న సహకారసంఘాలు, స్వయం సహాయక బృందాలకు, చిన్న,సూక్ష్మ పరిశ్రమలకు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా రూ.50లక్షల వరకు వడ్డీలేని రుణం మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. తైపూసం ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామన్నారు.
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండ శిఖరంపై కార్తిక దీపం వెలిగించేందుకు తగినఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శాఖ రూపొందిస్తామని, సముద్రమార్గంలో స్మగ్లింగ్‌ను అడ్డుకునేలా ప్రత్యేక దర్యాప్తు విభాగం ఏర్పా టు, ఈ కేసులపై త్వరితగతిన విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టులతో పాటు, స్మగ్లింగ్ ముఠాలకు ఎన్‌డీపీఎ్‌స చట్టం కింద మరణశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, డా.తమిళిసై, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిహార్‌లో ముగిసిన నితీష్ యుగం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి
జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ కేసులో కొత్త మలుపు
Read Latest Telangana News and National News