జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ కేసులో కొత్త మలుపు
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:34 AM
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అప్పీలు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ తప్పుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. బుధవారం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన అదనపు అఫిడవిట్‌ను మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అప్పీలు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ తప్పుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. బుధవారం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన అదనపు అఫిడవిట్‌ను మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేశారు. అందులో జడ్జి స్వర్ణ కాంత్ శర్మ పిల్లల ఎంప్యానెల్మెంట్ అంశంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ పిల్లలు ఇషాన్ శర్మ, శాంభవి శర్మలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న లీగల్ బ్రీఫ్స్, ఆర్థిక ప్రయోజనాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లీగల్ రిపోర్టర్ సౌరవ్ దాస్ వెల్లడించిన ఆర్టీఐ గణాంకాలను ఆ అఫిడవిట్‌లో కేజ్రీవాల్ పొందుపరిచారు. ఇవి కేవలం గౌరవప్రదమైన పదవులు కావని.. కేంద్రం నుంచి నిరంతరం పని పొందుతున్న వృత్తి పరమైన నియామకాలని తెలిపారు. అంతేకాదు జడ్జి పిల్లలకు స్వయంగా సొలిసిటర్ జనరల్ కేసులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నిష్పక్షపాత విచారణపై తనకు ఆందోళన ఉందని మాజీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఒక వైపు సీబీఐ ప్రాసిక్యూట్ చేస్తూ, మరో వైపు జడ్జి కుటుంబ సభ్యులు కేంద్రం నుంచి పని పొందుతుంటే.. పక్షపాత వైఖరి ఉంటుందని కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మౌఖిక వాదనలు వినిపించేందుకు అదనపు సమయం కావాలంటూ కోర్టును కేజ్రీవాల్ కోరారు. తన 'రిజాయిండర్' హక్కును కూడా వినియోగించుకుంటానని ఈ సందర్భంగా కోర్టుకు కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్
For More National News And Telugu News