Share News

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:30 PM

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్(3/21) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు.

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్
Noor Ahmad bowling

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్ఠిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్(3/21) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ పతనాన్ని శాసించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం..తన ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ చిట్కా తనకు బాగా ఉపయోగపడిందని తెలిపాడు.


నూర్ అహ్మద్ మాట్లాడుతూ..' నా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. విపరీతమైన ఉక్కపోతగా ఉన్న పరిస్థితుల్లో నా చేతి వేళ్లు తడవకుండా పొడిగా ఉంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో నా చేతి వేళ్లను పొడిగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేశాను. చేతి వేళ్లను పొడిగా ఉంచుకోవాలనే చిట్కా బాగా పనిచేసింది. దాంతో నేను అనుకున్న ప్రదేశంలో బంతిని వేయగలిగాను' అని తెలిపాడు.


'ఈ పిచ్ పరిస్థితి కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. బ్యాట్‌పైకి బంతి అంత సులువుగా రావడం లేదని నేను గుర్తించాను. ఆ పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. అందులో విజయం సాధించాను. ఇలాంటి ప్రదర్శనలు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. తదుపరి మ్యాచ్‌ల్లో కూడా జట్టు కోసం మరింత కష్టపడి పని చేస్తాను' అని నూర్ అహ్మద్ వెల్లడించాడు. కేకేఆర్ మ్యాచ్‌లో నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లు వేసి..కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాక అజింక్య రహానే, రింకూ సింగ్, గ్రీన్ వంటి డేంజరస్ ప్లేయర్లను ఔట్ చేశాడు.


ఇవి కూడా చదవండి:

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఆ విషయం నాకు సంతృప్తినిచ్చింది: అజింక్య రహానే

Updated Date - Apr 15 , 2026 | 01:41 PM