Share News

కొడుకే అడ్డం పడుతుంటే...!

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 AM

తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్‌ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

కొడుకే అడ్డం పడుతుంటే...!

  • అన్నాడీఎంకే అభ్యర్థికి వ్యతిరేకంగా కుమారుడి ప్రచారం

చెన్నై: తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్‌ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. తొలుత తండ్రికి బదులు తనకు సీటు కేటాయించాలంటూ కుప్పన్‌ కుమారుడు కార్తీక్‌ పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. అయినా, పార్టీ కుప్పన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ కారణంగా, కార్తీక్‌ తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. తన తండ్రికి ఓటు వేయద్దంటూ మద్దతుదారులతో నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు.


nani3.jpgఈ క్రమంలో, కుప్పన్‌కు మద్దుతుగా బుధవారం ఉదయం ప్రచారం చేపట్టిన పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి గోకులకృష్ణన్‌ను కార్తీక్‌, ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. ఒకానొక సమయంలో కొందరు గోకులకృష్ణన్‌పై దాడిచేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఆ నియోజకవర్గంలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 11:57 AM