Share News

తెలంగాణ ఎడ్‌సెట్ 2026: ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:35 PM

తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ ఎడ్‌సెట్ -2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

తెలంగాణ ఎడ్‌సెట్ 2026: ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
TG EdCET 2026

వరంగల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EDCET) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను తెలంగాణ ఎడ్‌సెట్ 2026 చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (VC), ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ గుర్తించిన బీఎడ్ కాలేజీల్లో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రకటనతో బీఎడ్ కోర్సులో చేయాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు తేదీలు, ఆలస్య రుసుము, గడువు, పరీక్ష తేదీ, ఫలితాల విడుదల తేదీలను స్పష్టంగా వెల్లడించారు.


ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ..

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026కు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ గడువులో అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వంటి వివరాలను సరైన విధంగా అప్‌లోడ్ చేయాలి. నిర్దిష్ట గడువులో దరఖాస్తు చేయలేని అభ్యర్థులకు ఆలస్య రుసుముతో కూడా అవకాశం కల్పించారు. షెడ్యూల్ ప్రకారం రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ విధంగా అభ్యర్థులకు అదనపు సమయం ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించారు.


మే 12న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష..

TG EDCET 2026 ప్రవేశ పరీక్ష మే 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులకు కేటాయించిన సెషన్ వివరాలు హాల్ టికెట్‌లో తెలియజేస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థుల బోధనా సామర్థ్యం, సాధారణ జ్ఞానం, సబ్జెక్ట్ పరిజ్ఞానం వంటి అంశాలను పరీక్షిస్తారు.


మే 30న ఫలితాల విడుదల..

TG EDCET 2026 ఫలితాలను మే 30వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ ర్యాంకుల ప్రకారం బీఎడ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్యాట్‌లో మంచి పర్సంటైల్‌ రాకున్నా మేనేజ్‌మెంట్‌కు మార్గాలెన్నో!

ఫోరెన్సిక్‌ ఉద్యోగాలకు వచ్చే నెలలో రాత పరీక్ష

Read Latest Education News And Telugu New

Updated Date - Feb 23 , 2026 | 05:59 PM