ఫోరెన్సిక్ ఉద్యోగాలకు వచ్చే నెలలో రాత పరీక్ష
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:40 AM
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్)లోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్)లోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషీయన్లు, ల్యాబ్ అసిస్టెంట్లతో కలిపి మొత్తం 60 పోస్టుల భర్తీ కోసం వచ్చేనెల 5, 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. మేడ ్చల్‌లోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మొత్తం 4,664 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 3,760 మందిని అర్హులుగా బోర్డు నిర్ణయించింది. అర్హత సాధించిన అభ్యర్థుల పూర్తి వివరాలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష మూడు పేపర్లు ఉంటుందని, ప్రతి పేపర్ గంట సమయంలో పూర్తి చేయాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.