Share News

అన్నీ మా దగ్గరే కొనాలి!

ABN , Publish Date - Jun 25 , 2026 | 10:03 AM

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.

అన్నీ మా దగ్గరే కొనాలి!
Hyderabad private schools

  • కార్పొరేట్‌ పాఠశాలల హకుం

  • దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు

  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

హైదరాబాద్: వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు. తమ వద్దే పుస్తకాలు, బెల్ట్‌లు, టైలు కొనాలని, బయట కొంటే తమ పాఠశాలలోకి అనుమతించమని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలోని బాలపూర్‌ మండల పరిధిలోని జల్‌పల్లి సర్కిల్‌తో పాటు పాతబస్తీలో వందల సంఖ్యల్లో పైవ్రేట్‌ పాఠశాలలు వెలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం పాఠశాలల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోడ్డు పక్కనే భవనాలు ఇరుకు గదుల్లో విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. 4 లేదా 5 అంతస్తుల భనాల్లో చిన్నారులను కూర్చొబెడుతున్నారు. ఆ భవనాలకు ఫైర్‌సేఫ్టీ ఉండదు. పొరపాటున జరగరాని ప్రమాదం జరిగితే కనీసం ఫైర్‌ ఇంజీన్‌, లేదా అంబులెన్స్‌ వచ్చే పరిస్థితులు కూడా ఉండవని, చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు భయాందోలనకు గురవుతున్నారు.


city4.2.jpgఅనుమతి ఒకచోట నిర్వహణ మరోచోట..

నూతన పాఠశాల ఏర్పాటు చేస్తున్నప్పుడు సంబంధి త అధికారుల నుంచి మొత్తం అనుముతులు తీసుకోవాలి. ఎన్ని అంతస్తులు, వాటికి రక్షణ, మైదానం, సెట్‌బాక్స్‌ ఎన్ని తరగతులు ఏ ప్రాంతంలో పాఠశాల ఉంటుందని అనుమతులు తీసుకోవాలి. కానీ బాలపూర్‌ మండలం షాహీన్‌నగర్‌, ఎర్రకుంట, పహాడిషరీఫ్‌, జల్‌పల్లి శ్రీరామ్‌కాలనీ, వాదీ ఏ ముస్తఫాలోని కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి హైదరాబాద్‌ ప్రాం తంలో తీసుకొని పాఠశాలను మాత్రం రంగారెడ్డిజిల్లాలో కొనసాగిస్తున్నట్లు సమాచారం.


కళాశాలలకు మించి ప్రైమరీ ఫీజు..

కార్పొరేట్‌ విద్య పేరుతో ప్రజల ముక్కుపిండి మరీ ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. విద్యా రంగంలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల ఆధిపత్యం కొనసాగుతోందనే చెప్పొచ్చు. ప్రైమరీ విద్యార్థి సంవత్సరం ఫీజు కళాశాల ఫీజును మించిపోతోంది. ప్రైమరీ స్థాయి విద్యార్థికి లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పైవ్రేటు పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

ఖాకీలు.. షరా‘మామూలే’

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 10:03 AM