Share News

అమ్మ వల్లే నా జీవితం నాశనం

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:31 AM

‘నాకు స్వేచ్ఛ లేకుండా చేసింది. నిత్యం దూషించేది. నా జీవితాన్ని నాశనం చేసింది. అందుకే మా అమ్మను నేనే చంపేశాను’ అని పోలీసుల ఎదుట శ్వేత...

అమ్మ వల్లే నా జీవితం నాశనం

  • నిత్యం దూషించేది..స్వేచ్ఛ లేకుండా చేసింది.. అందుకే చంపేశా

  • కర్ణాటకలో తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలు శ్వేత వెల్లడి

బెంగళూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘నాకు స్వేచ్ఛ లేకుండా చేసింది. నిత్యం దూషించేది. నా జీవితాన్ని నాశనం చేసింది. అందుకే మా అమ్మను నేనే చంపేశాను’ అని పోలీసుల ఎదుట శ్వేత అంగీకరించినట్లు తెలిసింది. బెంగళూరులో తల్లిదండ్రులు, చెల్లిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతను పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి రైల్వేస్టేషన్‌ సమీపంలో బీచ్‌ వద్ద ఆమెను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు కెన్నెత్‌తో కలసి శ్వేత సోమవారం రాత్రి ముగ్గురిని హత్య చేసింది. అనంతరం వారిద్దరూ బైక్‌పై పారిపోయి తమిళనాడు చేరుకున్నారు. బైక్‌ చెడిపోవడంతో దాన్ని అక్కడే వదిలేశారు. అక్కడి నుంచి శ్వేత మాత్రమే బస్సులో పుదుచ్చేరికి వెళ్లింది. పోలీసులు ఆమెను ట్రాక్‌చేసి పట్టుకున్నారు. శ్వేత తన డైరీలో ‘ఐయామ్‌ శాడ్‌. ఐ యామ్‌ లోన్లీ. ఐయామ్‌ డిప్రెస్డ్‌’ అని రాసుకున్నట్లు తెలిసింది. కెన్నెత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 08:06 AM