Share News

పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:22 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు
Schools, Textbooks

  • మండలాలకు చేరిన 2,77,340 పుస్తకాలు

  • పాఠశాల పునఃప్రారంభం రోజునే అందజేత

కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బడి బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకా లు, నోట్‌బుక్‌లు, యూనిఫామ్స్‌ను విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతోంది.


జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు జిల్లాకు 2,77,340 పుస్తకాలను కేటాయిం చింది. వాటిని ఇప్పటికే మండల విద్యాశాఖ కార్యాల యాలకు చేరవేసి వేసవి సెలవుల్లోనే పాఠశాలలకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లోకి పంపించి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన ఈనెల 15వ తేదీ నుండే విద్యార్తులకు పాఠ్యపుస్త కాలను, యూనిఫాంలను అందజేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి అధికారులను ఆదేశించారు. ఈమేరకు పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు చేరేవేసేందుకు సిద్ధమవుతున్నారు.


  • జిల్లాకు కొత్తగా 58 ప్రీప్రైమరీ పాఠశాలలు

జిల్లాలో ఇప్పటి వరకు 22 ప్రీప్రైమరీ పాఠశాలలు ఉండగా ఈయేడు కొత్తగా మరో 58 ప్రీప్రైమరీ పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ బ్రేక్‌ ఫాస్ట్‌ (అల్పాహారం), నాణ్యమైన మధ్యాభోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలను స్వీక రించిన ప్రశాంత్‌రెడ్డి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను, ఉపాధ్యాయుల సమన్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఉపాధ్యాయులు,


boooks.jpgఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖాముఖీ నిర్వహించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ పంపిణీపై దృష్టి సారించి పాఠశాలల్లోని విద్యార్తులందరికి పునః ప్రారంభం నుంచే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయాలని, ఎక్కడ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. బడిబాట కార్యక్ర మాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించి తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించడంతో ఉపాధ్యాయులు అందుకోసం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నందున ఈయేడు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ధాన్యం ధర మరింత పైపైకి..

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 01:26 PM