Share News

కొత్త రిజిస్ట్రార్‌ ఎక్కడ?

ABN , Publish Date - Jul 14 , 2026 | 09:28 AM

యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్‌ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్‌. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్‌టీయూలో పాలన సాగిపోతోంది.

కొత్త రిజిస్ట్రార్‌ ఎక్కడ?
JNTU, Hyderabad

  • వచ్చీ రాగానే రెండు వారాల విదేశీ పర్యటనకు

  • ఇన్‌చార్జ్‌ నియామకంపై విభాగాలకు చేరని ఉత్తర్వులు

  • రిజిస్ట్రార్‌ లేకుండానే కొద్ది రోజులుగా పాలన

  • జేఎన్‌టీయూలో కీలక ఫైళ్లు పెండింగ్‌లోనే

  • జెట్‌లాగ్‌తో రిజిస్ట్రార్‌ రావడం మరింత ఆలస్యం?

హైదరాబాద్‌ సిటీ: యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్‌ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్‌. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్‌టీయూలో పాలన సాగిపోతోంది. రెండు వారాలుగా అటు అధికారులకు గానీ, ఇటు ఉద్యోగులకు గానీ రిజిస్ట్రార్‌ అందుబాటులో లేరు. గత నెల 12న కొత్త రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి, పట్టుమని పక్షం రోజులు గడవక ముందే.. వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై విదేశాలకు వెళ్లారు. గత నెల 27 నుంచి ఈ నెల 10 వరకు రిజిస్ట్రార్‌ సెలవు పెట్టిన విషయం కొద్దిమంది వ్యక్తిగత సిబ్బందికి మినహా, వర్సిటీలోని ముఖ్యమైన విభాగాల డైరెక్టర్లకు గానీ, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు గానీ నేటికీ సమాచారం లేదు.


city3.2.jpgసోమవారం కూడా రిజిస్ట్రార్‌ విధులకు హాజరు కాకపోవడంతో కొద్ది రోజులుగా రిజిస్ట్రార్‌ లేకుండానే యూనివర్సిటీలో పాలన కొనసాగుతున్నట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. రిజిస్ట్రార్‌ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడం, ఈ నెల 10వరకు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ జారీచేసిన ఉత్తర్వులు సైతం కళాశాలలకు, ఇతర ముఖ్యమైన విభాగాలకు పంపకపోవడం మంచి సంప్రదాయం కాదని సీనియర్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్‌ రిజిస్ట్రార్‌ లేకపోవడంతో ఆర్థిక సంబంధం ఉన్న ఫైళ్లు క్లియరెన్స్‌కు నోచుకోవడం లేదు. పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ జారీ కూడా ఆలస్యం అవుతోందని ఆశావహ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉన్నతాధికారుల అసంతృప్తి

ఈ నెల 10వరకు పెట్టిన సెలవు ముగిసినప్పటికీ రిజిస్ట్రార్‌ తిరిగి విధుల్లో చేరకపోవడం పట్ల పరిపాలనా విభాగం ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మునుపు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన అధికారికే.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రిజిస్ట్రార్‌గా కొనసాగాలని ఉన్నతాధికారి ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రార్‌ విదేశాల నుంచి తిరిగి వచ్చినా జెట్‌లాగ్‌ (విమాన ప్రయాణంతో వచ్చే అలసట/నిద్రలేమి) కారణంగా మరికొన్ని రోజులు విధులకు హాజరు కాకపోవచ్చని వర్సిటీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హయాంలోనే సింగరేణికి నష్టాలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 09:28 AM