జేఎన్‌టీయూలో ‘బెస్ట్’ శిక్షణ!
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:44 AM
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల విద్యార్థుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
రూ.18కోట్లతో ఆధునిక ల్యాబొరేటరీలు
బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందం
హైదరాబాద్ సిటీ: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల విద్యార్థుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడమే లక్ష్యంగా బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
సదరు సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద సుమారు రూ.18కోట్ల విలువైన ల్యాబొరేటరీలను జేఎన్‌టీయూలో నెలకొల్పేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడం విశేషం. ఆయా ల్యాబొరేటరీల ఏర్పాటు నిమిత్తం వర్సిటీ ప్రాంగణంలో బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్ ట్రైనింగ్ (బెస్ట్) సెంటర్ల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి. మొదటి దశలో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల విద్యార్థులకు బెస్ట్ కేంద్రాలను డిసెంబరులోగా అందుబాట్లోకి తీసుకు రావాలని వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
మొదటి దశలో రెండు కేంద్రాలు
మొదటి దశలో జేఎన్‌టీయూ బెస్ట్ కేంద్రాలు మెకానికల్ ఇంజనీరింగ్ కోసం అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ (రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్), ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ కోసం ఎలక్ర్టిక్ మొబిలిటీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అంశాలను నేరుగా అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) పాఠ్యప్రణాళికలో అనుసంధానం చేశారు. వర్సిటీలోని దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 8 పరికరాల ప్రయోగశాలలు,
ఒక కంప్యూటర్ ప్రయోగశాల కోసం రూ.9కోట్ల నుంచి 10 కోట్ల పెట్టుబడితో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ వర్టికల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులకు 564 గంటల శిక్షణ, ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మెకట్రానిక్స్, మోషన్ కంట్రోల్ అండ్ సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మాడ్యూళ్లను కవర్ చేస్తారు. ఇందుకోసం నాలుగు పరికరాల ప్రయోగశాలలు, ఒక కంప్యూటర్ ప్రయోగశాలను రూ.7-8 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాచిగూడ-అశోకాపురం ఎక్స్‌ప్రెస్ రైలు సమయంలో మార్పులేదు
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News