Share News

తానా, తామా యోగా కార్యక్రమానికి మంచి స్పందన

ABN , Publish Date - Aug 27 , 2026 | 09:21 AM

కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) సంయుక్తంగా 2026 ఆగస్టు 9న జార్జియాలోని ఆల్ఫారెట్టాలో ఉన్న కెటి బాంక్వెట్స్‌లో ‘ఉపస్తంభ’ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.

తానా, తామా యోగా కార్యక్రమానికి మంచి స్పందన

ఇంటర్నెట్ డెస్క్: కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) సంయుక్తంగా 2026 ఆగస్టు 9న జార్జియాలోని ఆల్ఫారెట్టాలో ఉన్న కెటి బాంక్వెట్స్‌లో ‘ఉపస్తంభ’ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా శిక్షకులు, సామాజిక కార్యకర్త శ్రీ కిరణ్ చుక్కపల్లి నేతృత్వం వహించారు. రెండు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 50 మందికిపైగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో శ్రీ కిరణ్ పాల్గొన్న వారికి సూర్య నమస్కారాలు, ఇతర సాంప్రదాయ నమస్కారాలు, అలాగే అన్ని వర్గాల వారికి ఉపయోగపడే వివిధ యోగాసనాలను నేర్పించారు. ప్రత్యేకంగా ప్రాణాయామం, శ్వాసక్రియ పద్ధతులపై దృష్టి సారిస్తూ, వివిధ యోగా భంగిమలతో శ్వాసను ఎలా సమన్వయం చేసుకోవాలో సమగ్రంగా వివరించారు.


ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా, తామా నాయకులు సహకరించారు. తానా నాయకులు శ్రీనివాస్ లావు(ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), అంజయ్య చౌదరి లావు(పాస్ట్ ప్రెసిడెంట్), శేఖర్ కొల్లు(ఆర్ఆర్), భరత్ మద్దినేని(బోర్డు డైరెక్టర్), మధుకర్ యార్లగడ్డ(ఫౌండేషన్ ట్రస్టీ, తామా చైర్మన్), సునీల్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్), సోహిణి అయినాల(ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సెక్రటరీ) తోపాటు తామా ప్రెసిడెంట్ సునీత పొట్నూరి సహకారాన్ని మార్గదరకత్వాన్ని అందించారు.

WhatsApp Image 2026-08-27 at 5.59.42 AM.jpeg

మాలతి నాగభైరవ, ఆర్తిక అన్నే, పూలని జస్తి, శ్రీనివాస్ ఉప్పు, చైతన్య కొర్రపాటి, రాజేష్ జంపాల, తిరు చిల్లపల్లి తామా ప్రెసిడెంట్ ఎలక్ట్, పార్వతి కొంపెల్ల, రాఘవ తాడవర్తి, యశ్వంత్ జొన్నలగడ్డ, హరికృష్ణ అద్దంకి, శ్రీనివాస్ రామనాధం, సురేష్ ధూళిపూడి తదితరులుఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. ఈ ఈవెంట్ కోసం కెటి బాంక్వెట్స్ వేదికను అందించిన కిషోర్ తాటికొండకు ప్రత్యేక ధన్యవాదాలను, కిరణ్ చుక్కపల్లికి, నాయకత్వ బృందాలకు, నిర్వాహకులకు, వలంటీర్లకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

WhatsApp Image 2026-08-27 at 5.59.43 AM (1).jpeg

WhatsApp Image 2026-08-27 at 5.59.43 AM.jpeg


ఇవీ చదవండి:

ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. ఏడుగురి మృతి, 10 మందికి గాయాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు

Updated Date - Aug 27 , 2026 | 09:21 AM