Share News

ఆర్మీ పిలుస్తోంది!

ABN , Publish Date - Mar 02 , 2026 | 07:15 AM

జిల్లాలో నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం. ఆర్మీ నియామకానికి సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌లో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఆర్మీ పిలుస్తోంది!
Agniveer Notification

  • అగ్నివీర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ జారీ

  • ఏప్రిల్ 1 వరకూ దరఖాస్తుకు అవకాశం

  • రెండు దశల్లో అభ్యర్థుల ఎంపిక

గుజరాతీపేట, మార్చి 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం. ఆర్మీ నియామకానికి సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ (Agniveer Notification) విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌లో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు విశాఖలోనే ఫిజికల్ ఫిట్‌నెస్, ఈవెంట్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు చేశారు. 21వ తేదీ నుంచి 27వ తేదీకి వయోపరిమితిని పెంచారు. ఈసారి ఆన్‌లైన్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో పూర్తిచేసుకొనే వెసులుబాటు కల్పించారు. అంటే తెలుగులో పరీక్ష రాసుకోవచ్చు.


ఈ జిల్లాల అభ్యర్థులు అర్హులు..

విశాఖపట్నం ఏఆర్వీ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు.


భర్తీ చేసే పోస్టులు ఇవే...

అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్, టెక్నికల్, ట్రేడ్స్ మేన్లను భర్తీ చేయనున్నారు. (పోస్టును బట్టి ఎనిమిది, పదోతరగతి ఇంటర్‌లో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్టులో కచ్చితంగా 40శాతం మార్కులు రావాలి).


మొదటి దశ ఎంపిక..

మొదటి దశ (ఆన్‌లైన్ పరీక్ష): ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు (తాత్కాలిక తేదీలు) రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (సీఈఈ) నిర్వహిస్తారు.


రెండో దశ ఎంపిక..

ఆన్‌లైన్ రాత పరీక్షలో ప్రతిభ చూపి షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులకు ముందుగా నిర్ణయించిన తేదీల్లో, నిర్దేశిత ప్రదేశాలలో దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ) నిర్వహిస్తారు.


వెబ్‌సైట్ వివరాలు..

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ జాయిన్ఇండియా ఆర్మీ. ఎన్ఐసీ ఇన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులను స్వీకరించమని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 07:42 AM