Share News

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:43 AM

రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్‌ జరగనుంది.

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ
AP PGSET

ఎచ్చెర్ల, మార్చి4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్‌ జరగనుంది. ఈ సెట్‌తోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూని వర్సిటీ, అనుబంధ కళాశాల్లోని సైన్స్‌, ఆర్ట్స్‌ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసిన అభ్యర్తులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను వచ్చే నెల 20వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకో వచ్చు. మే 5 నుంచి 11వ తేదీల్లో పీజీ సెట్‌ జరగనుంది. ఆసక్తిగల విద్యార్థులు ఓసీ రూ.850, బీసీలు రూ.750, ఎస్సీ, ఎస్టీలు రూ.650 దరఖాస్తు రుసుం చెల్లించాలి.


బీఆర్‌ఏయూలో కోర్సుల వివరాలు..

అంబేడ్కర్‌ వర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఎంకాం, తెలుగు, ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌, రూరల్‌ డెవలప్‌మెంటు, ఎంఎల్‌ఐఎస్సీ, సోష ల్‌వర్క్‌, ఎంజేఎంసీ, ఎంఈడీ కోర్సులు ఉన్నా యి. వర్సిటీలోని సైన్స్‌ కళాశాలలో మేథ్స్‌, అఫ్లైడ్‌ మేథ్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోటెక్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పీజీ సెట్‌ ద్వారా భర్తీచేయనున్నారు. అలాగే వర్సిటీలోని ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో సీట్లను లా సెట్‌ ద్వారా, ఎంబీఏ, ఎంసీఏ సీట్లను ఐసెట్‌ ద్వారా, బీఈడీ (స్పెషల్‌) సీట్ల ఎడ్‌సెట్‌ ద్వారా సీట్లను భర్తీచేస్తారు. అదే విధంగా నా లుగేళ్ల సమీకృత బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సుల్లోని సీట్లను జాతీయ స్థాయిలో నిర్వ హించిన ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 08:43 AM