Share News

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ABN , Publish Date - May 12 , 2026 | 06:50 PM

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువును మే 13 వరకు పొడిగించింది.

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
AP Inter Supplementary Exam

అమరావతి, మే12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (AP Inter Supplementary Exam) (IPASE మే-2026) రాయనున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువును మే 13, 2026 వరకు పొడిగించింది.


రూ.5,000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు

ఇంటర్ బోర్డు విడుదల చేసిన తుది నోటిఫికేషన్ ప్రకారం, రూ.5,000 ఆలస్య రుసుముతో విద్యార్థులు మే 13వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఈ తేదీ తర్వాత ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది. IPASE మే-2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది చివరి అవకాశమని ఇంటర్ బోర్డు పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే ఫీజు చెల్లించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 07:04 PM