Share News

అనాథ విద్యార్థులకు స్వనాథ్ స్కాలర్‌షిప్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:01 PM

అనాథ విద్యార్థులు, కొవిడ్‌-19లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ స్వనాథ్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తోంది.

అనాథ విద్యార్థులకు స్వనాథ్ స్కాలర్‌షిప్‌
AICTE Swanath Scholarship,

  • ఉన్నత విద్య కోసం ఏడాదికి రూ. 50 వేలు

  • డిప్లొమా, డిగ్రీ కోర్సులకు అవకాశం

చొప్పదండి(కరీంనగర్): అనాథ విద్యార్థులు, కొవిడ్‌-19లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) ఏఐసీటీఈ స్వనాథ్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తోంది. దీనికి సంబం దించిన నోటిఫికేషన్‌ విడుదల కాగా దేశవ్యాప్తంగా డిగ్రీ, డిప్లొమా కోర్సును చేసిన రెండువేల మంది విద్యార్థులకు ఏడాదికి 50 వేల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేయనున్నారు. ఏఐసీటీఈ ఆమోదిత కళాశాలల్లో చ దివే విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు.


స్కాలర్‌షిప్‌ వివరాలు...

ఉన్నత విద్యను అభ్యసించే అనాథ విద్యార్థులు, కొవిడ్‌ సమయంలో తల్లి దండ్రులను కోల్పోయిన విద్యార్థులు, విధి నిర్వహణలో అమరులైన సాయుధ దళాలు, కేంద్ర పారా మిలిటరీ దళాల సిబ్బంది పిల్లలు, తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, ప్రమాదంలో మరణించిన లేదా 80 శాతం కం టే ఎక్కువ వైకల్యం పొందిన తల్లి దండ్రుల పిల్లలకు స్కాలర్‌ షిప్‌ను అందజేస్తారు.


zz.jpgవిద్యార్థులకు కాలేజీ ఫీజులు, కంప్యూటర్‌, పుస్తకాలు, స్టేషనరీతోపాటు ఇతర అవసరాల కోసం ఈ స్కాలర్‌షిప్‌ల ను ఉద్దేశించి అందజేస్తారు. విద్యార్థులు ఏఐసీటీఈ ఆమోదించిన డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో రెగ్యులర్‌గా చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలలోపు ఉన్నవారు అర్హులు. డిప్లొమా విద్యార్థులు పదో తరగతి పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అదే విధంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్‌లో సాధిం చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిగ్రీ విద్యార్థులకు వెయ్యి స్కాలర్‌ షిప్‌లు, డిప్లొమా విద్యార్థులకు వెయ్యి స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తారు. స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఏడాదికి 50 వేల రూపాయలను కోర్సు పూర్తయ్యేంత వరకు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.


దరఖాస్తులు ఇలా...

విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లి దండ్రులకు సంబంధించిన అవసరమైన ధ్రువపత్రాలు, ఆధాయ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, 10వ తరగతి, ఇంటర్‌ మార్కుల మెమోలు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలి. విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థ దరఖాస్తులను ధ్రువీకరించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర విద్యాశాఖ దరఖాస్తును పరిశీలిస్తుంది. అర్హత గల విద్యార్థులు అక్టోబరు 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఖైదీకి వార్డర్‌కు మధ్య.. మూడో వ్యక్తి!

10 వేల కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 12:07 PM