Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Sep 27 , 2026 | 07:13 AM

వారఫలాలు.. 27 సెప్టెంబర్‌ - 3 అక్టోబర్‌ 2026, పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgసంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను అతిగా విశ్వసించవద్దు. ప్రతీ విషయం స్వయంగా తెలుసుకోండి.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgతలపెట్టిన కార్యం సఫలమవు తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం. తరచూ ఆత్మీయులతో సం భాషిస్తారు. పనులు హడావుడిగాసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రముఖులకు సన్ని హితులవుతారు. సభ్యత్వ స్వీకరణకు అను కూలం. బాధ్యతలు అధికమవుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgసర్వత్రా యోగదాయకం. ప్రణాళికాబద్థంగా పూర్తి పనులు చేస్తారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgలావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులతో కాల క్షేపం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నం ఫలిస్తుంది.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgఖర్చులు ప్రయోజనకరం. రుణ ఒత్తిళ్లు తొలుగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. స్నేహ సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలు చేపడతారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పెట్టుబడులకు తగిన సమయం. బెట్టింగ్‌కు పాల్పడవద్దు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgసంప్రదింపులు నిరుత్సాహ పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితు లతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనుల సాను కూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు విపరీతం. అవసరాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఊహించని సంఘటన ఎదు రవుతుంది. ఏ విషయాన్ని తేలికగా తీసుకో వద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పట్టుదలకు పోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgకొంతమేరకు అనుకూలం. అవకాశాలు కలిసివస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అనవసర విషయాలకు ప్రాధా న్యమివ్వవద్దు. ముఖ్యుల సందర్శనం వీలుప డదు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. నోటీ సులు అందుతాయి. న్యాయనిపుణులతో సం ప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంత ర్యం గ్రహించండి. గృహమార్పు అనివార్యం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgఅన్నిటా మీదే పైచేయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. నిలిపి వేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పెద్దఖర్చు తగులుతుంది. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తులతో తరచూ సంభాషిస్తుంటారు. కనిపిం చకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgతలపెట్టిన కార్యం నెరవేరు తుంది. లక్ష్యానికి చేరువవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సంతృప్తికరం. ఆలయాలకు విరా ళాలందిస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఒప్పందాల్లో ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభా లకు లొంగవద్దు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgలావాదేవీల్ల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఆదాయానికి మించి ఖర్చులుం టాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పనులు హడావుడిగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవు తారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgపరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. నగదు డ్రా చేేసటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ప్రముఖులను కలుసుకుం టారు. వ్యవహారం సానుకూలమవుతుంది. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వొద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏఐ దారి తప్పితే100 కోట్ల మరణాలు

టికెట్లు 2.69 లక్షలు.. యూజర్లు 6 లక్షలు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 07:17 AM