మన్మోహన్ ఫెలోషిప్ రెండో బ్యాచ్ ఎంపిక షురూ
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:48 AM
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 94వ జయంతిని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఫెలోషిప్’ రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియను అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) శనివారం ప్రారంభించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 94వ జయంతిని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఫెలోషిప్’ రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియను అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) శనివారం ప్రారంభించింది. ‘వృత్తిపరమైన ప్రతిభ నుంచి రాజకీయ ప్రభావం దిశగా’ అనే థీమ్‌తో ఈ ఏడాది 100 మంది యువ నిపుణులను ఎంపిక చేయనున్నట్లు ఏఐపీసీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రకటించారు.
వివిధ రంగాల నిపుణులను రాజకీయాలు, విధాన రూపకల్పన, దేశ నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేయడమే ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొండా లక్ష్మణ్ త్యాగం భావి తరాలకు స్ఫూర్తి : సీఎం రేవంత్
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News