Share News

ఆర్టీసీలో జోరుగా ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:36 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 12 సంఘాలకు హైదరాబాద్‌ జంటనగరాల సంయుక్త లేబర్‌ కమిషనర్‌, రిటర్నింగ్‌ అధికారి శనివారం ఎన్నికల గుర్తులు కేటాయించారు.

ఆర్టీసీలో జోరుగా ఎన్నికల ప్రచారం
TGRTC union elections

  • అక్టోబరు 9న పోలింగ్‌..

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 12 సంఘాలకు హైదరాబాద్‌ జంటనగరాల సంయుక్త లేబర్‌ కమిషనర్‌, రిటర్నింగ్‌ అధికారి శనివారం ఎన్నికల గుర్తులు కేటాయించారు. బతుకమ్మ, నిచ్చెన, కత్తెర, బస్సు, బస్సు టైరు, పులి, ధర్మచక్రం, బాణం, నక్షత్రం, చేతిలో కాగడా, గధ తదితర గుర్తులు కేటాయించారు. అక్టోబరు 9న రహస్య బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరగనుంది. అదే నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు.


హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. గుర్తులు ఖరారు కావడంతో సంఘాలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సుమారు దశాబ్దకాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో సంస్థపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రధాన సంఘాలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన సంఘానికి ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తింపు సంఘం కీలకపాత్ర పోషించనుంది. పలు సంఘాలకు రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలపడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఒక్కో సీటుకూ మూడు పేర్లు

డిసెంబరు నుంచి ఎన్నికల జాతర!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 06:36 AM