Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:08 AM

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.. 25 - 31 అక్టోబర్‌ 2026, పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgశుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అందరి తోనూ మితంగా సంభాషించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సంఘటన మీపై ప్రభా వం చూపుతుంది. ఎదుటివారి అభిప్రాయా లకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgపరిస్థితులు క్రమంగా చక్కబడ తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధువులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగు తుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసు కుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యవహ రాల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgలక్ష్యసాధనకు ఓర్పు, ప్రధానం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కార్యదీక్షే మిమ్ములను ముందుకు నడిపి స్తుంది. సాయం ఆశించవద్దు. స్వయంకృషి తోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. శుభలేఖ అందుకుంటారు. మీ ఇష్టాయిష్టాలకు ఆమోదం లభిస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgప్రతీ విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణ యం సత్ఫలితమిస్తుంది. ప్రణాళికా బద్ధంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgలావాదేవీలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగ వద్దు. నిపుణులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుం టారు. పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరినీ తప్పుపట్టవద్దు. స్థిమితంగా ఉండ టానికి యత్నించండి. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgలక్ష్యానికి చేరువలో ఉన్నారు, ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. స్వయం కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆర్థికంగా ఫర్వా లేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgవ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మధ్యలో ఆగిన పనులు పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

zz.jpgకొత్తయత్నాలు చేపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. పనులు వేగవంతమ వుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. శుభలేఖ అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgఅన్ని విధాలా అనుకూలమే. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు ప్రయోజ నకరం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అనవసర విషయాల జోలికి పోవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభా లకు లొంగవద్దు. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. స్నేహ సంబం ధాలు బలపడతాయి. పత్రాల్లో మార్పులు సాధ్యపడవు. మరోసారి యత్నించండి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgమీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టు దలతో పనులు పూర్తి చేస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల రాక ఉపశ మనం కలిగిస్తుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgస్థిరాస్తి ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలివారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meenam.jpgమీదైన రంగంలో రాణిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయినవారే సందేహి స్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ నుంచి విషయ కరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేసీఆర్‌ ఫాంహౌస్‌ పరిసర గ్రామాల సరిహద్దు రీ సర్వే షురూ

ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ప్రక్రియ మరింత జాప్యం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 07:17 AM