తెలంగాణలో ‘జేకే’ పెయింట్స్ ప్లాంట్
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:10 AM
ప్రముఖ సిమెంట్ తయారీదారు జేకే సిమెంట్.. అనుబంధ సంస్థ జేకే మ్యాక్స్ పెయింట్స్.. తెలంగాణలో పెయింట్స్ తయారీ ప్లాంట్‌ను...
రూ.130 కోట్లతో సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు
న్యూఢిల్లీ: ప్రముఖ సిమెంట్ తయారీదారు జేకే సిమెంట్.. అనుబంధ సంస్థ జేకే మ్యాక్స్ పెయింట్స్.. తెలంగాణలో పెయింట్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. సూర్యాపేట జిల్లాలోని రఘునాధపాలెంలో రూ.130 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు జేకే సిమెంట్ బోర్డు శనివారం ఆమోదం తెలిపింది. పెయింట్ల వ్యాపారం కోసం కేటాయించిన రూ.600 కోట్ల నుంచే ఈ ప్లాంట్ నిర్మాణానికి నిధులు సమకూర్చనుంది. నిర్మాణం ప్రారంభమైన 12 నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్ ఏటా 75,000 కిలోలీటర్ల పెయింట్‌ను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉండనుంది. జేకే మ్యాక్స్ పెయింట్స్ ఇప్పటికే రాజస్థాన్‌లోని భీవాడీలో 73,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జేకే సిమెంట్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.31 శాతం వృద్ధితో రూ.169.3 కోట్లకు చేరుకుంది. కంపెనీ రాబడి 23.65 శాతం పెరిగి రూ.3,733.42 కోట్లుగా నమోదైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల