కేసీఆర్ ఫాంహౌస్ పరిసర గ్రామాల సరిహద్దు రీ సర్వే షురూ
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:01 AM
మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసర గ్రామాల సరిహద్దు రీ సర్వే శనివారం ప్రారంభమైంది.
మర్కుక్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసర గ్రామాల సరిహద్దు రీ సర్వే శనివారం ప్రారంభమైంది. కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు సర్వే, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు. శుక్రవారం ఆయా గ్రామ పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. డివిజనల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు బానోతు సేవ్యా నాయక్, వంశీ ఆధ్వర్యంలో రెండు బృందాలు సర్వే నిర్వహించాయి. ఎర్రవల్లిలో మొత్తం 14 కి.మీ. సరిహద్దుకు గాను 5 కి.మీ, వెంకటాపూర్‌లో 13 కి.మీ.కు గాను 1.5 కి.మీ సర్వే పూర్తి చేశారు. మిగిలిన సరిహద్దుల సర్వేను సోమవారం కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News