అవధూత్ సాథేపై సెబీ వేటు
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:04 AM
సామాజిక మాధ్యమాల ద్వారా పెట్టుబడి సలహాలిచ్చే ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్..
ఇన్వెస్టర్లకు రూ.546 కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా పెట్టుబడి సలహాలిచ్చే ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లుయెన్సర్) అవధూత్ సాథేపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వేటు వేసింది. స్టాక్ మార్కెట్ పాఠాల బోధన ముసుగులో పెట్టుబడి సలహాలు, రీసెర్చ్ అనలిస్ట్ సేవలందించేందుకు ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ.546.17 కోట్ల సొమ్మును, రూ.67.87 కోట్ల వడ్డీతో కలిపి తిరిగిచ్చేయాలని ఆయనకు చెందిన అవధూత్ సాథే ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎ్‌సటీఏపీఎల్)ను సెబీ ఆదేశించింది. అంతేకాదు, ఏఎ్‌సటీఏపీఎల్‌తో పాటు సాథేను రెండేళ్ల పాటు లేదా ఇన్వెస్టర్ల సొమ్ము రిఫండ్ చేసే వరకు (ఏది తర్వాత ఐతే అది) సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించింది. అలాగే, ఈ అకాడమీ, దాని వ్యవస్థాపకుడు అవధూత్ సాథే, డైరెక్టర్ గౌరీ అవధూత్ సాథేపై మొత్తం రూ.11.5 కోట్ల జరిమానా కూడా విధించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల