కశ్మీరీలను రక్షిస్తోంది పాకిస్థానే..
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:15 AM
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఫరూఖ్ దేశద్రోహి, పాక్ వెళ్లిపో : బీజేపీ
శ్రీనగర్, అక్టోబరు 24 : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ సమస్యను పదేపదే ప్రస్తావిస్తున్న పాకిస్థానే.. జమ్మూకశ్మీర్ ప్రజలను రక్షిస్తోందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భారత ప్రభుత్వం తనకున్న సమస్యల వల్ల కశ్మీరు అంశంలో మౌనంగా ఉండిపోతుందని ఆరోపించారు. బారాముల్లాలో పార్టీ కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఫరూఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎందుకు ఆశిస్తున్నారని, న్యాయం కావాలన్నా, హక్కులు సాధించుకోవాలన్నా పోరాటం చేయాల్సిందేనని పార్టీ శ్రేణులతో అబ్దుల్లా అన్నారు. ఇక, ముస్లింలే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకమవ్వాలని ఫరూఖ్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. మరోపక్క, ఫరూఖ్ అబ్దులా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఫరూఖ్ అబ్దుల్లా దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ డిమాండ్ చేశారు. ఫరూఖ్ ఇదే తరహా వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉండి చేయగలరా? అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష