Share News

ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ప్రక్రియ మరింత జాప్యం!

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:57 AM

ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది.

ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ప్రక్రియ మరింత జాప్యం!
TGTS

  • కొత్త ఆర్‌ఎఫ్‌పీ రూపకల్పనపై టీజీటీఎస్‌ కసరత్తు

హైదరాబాద్‌, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది. ‘ప్రతిపాదనల కోసం అభ్యర్థన’ (ఆర్‌ఎ్‌ఫపీ)లో మరిన్ని అంశాలు చేర్చిన అనంతరం టెండర్‌ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ (టీజీటీఎస్‌) యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో మరో 3-4 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీతో ప్రభుత్వ ఒప్పందం 2024 లోనే ముగిసినట్లు తెలుస్తోంది.


అప్పటి నుంచి గడువు పొడిగిస్తూ అదే ఏజెన్సీ ద్వారా సేవలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొత్త ఏజెన్సీ ఎంపిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా టెండర్లలో పోటీని పెంచడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడం వంటి అంశాలు కీలకం. అయితే పాత ఒప్పందం ముగిసినా పొడిగింపులు కొనసాగుతుండటంతో కొత్త టెండర్‌ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 06:57 AM