వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Aug 16 , 2026 | 07:02 AM
ఈ వారం రాశిఫలాలు.. 16 - 22 ఆగస్టు 2026 (పి.ప్రసూనా రామన్)
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. అనేక పనులతో సతమ తమవుతారు. రావలసిన ధనం అందుతుంది. వెండి బంగారాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. మీజోక్యం అనివార్యం. దైవకార్యంలో పాల్గొంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఆమోదయోగ్యమ వుతుంది. కొత్త పనులు చేపడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుం టారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. నిపుణుల సలహా పాటిస్తారు. ధనయోగం ఉంది. ఖర్చులు భారమనిపించవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహసంబం ధాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యో న్ముఖులను చేస్తాయి. మధ్యవర్తులు, కన్సల్టె న్సీలను ఆశ్రయించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులకు మీ సమస్య తెలియజేయండి. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషం కలిగించే వార్త వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరచరాస్తుల ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి శుభం జరుగుతుంది. పత్రాలు అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరు స్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించు కోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. పరిస్థితులు త్వరలో మెరుగు పడతాయి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అనుకోని సంఘ టన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యపడవు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చుచేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులతో కాల క్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలను అదుపులో పెట్టండి. పోయా యనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ప్రతీ విషయంలోనూ పట్టు దలగా ముందుకెళతారు. మీ కృషి ఫలిస్తుంది. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు, బాధ్యతలు పురమా యించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగి స్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
గ్రహస్థితి బాగుంది. వస్తు లాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు చురు కుగా సాగుతాయి. తరచూ ఆత్మీయులతో సం భాషిస్తుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు చేపడతారు. మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యక్రమాలు విజయవం తంగా సాగుతాయి. లక్ష్యసాధనకు చేరువవు తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. కొంత మొత్తం పొదుపుచేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. తలపెట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆచితూచి అడుగేయండి. కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందు కుంటారు. ఖర్చులు విపరీతం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆరోగ్యం కుదు టపడుతుంది. శుభకార్యానికి హాజరవుతారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలను తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
లావాదేవీలు అర్థాంతరంగా ముగుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి.
ఈ వార్తలు కూడా చదవండి:
వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్ డుమ్మా
మావోయిస్టుల అడ్డాల్లో తిరంగా రెపరెపలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News