వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్ డుమ్మా
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:43 AM
ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు....
ఎర్రకోటలో కార్యక్రమానికి హాజరవ్వని ఇరువురు నేతలు
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమానికి ఇరువురు నేతలు వరుసగా రెండో ఏడాది కూడా గైర్హాజరవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ వేడుకలకు రాజకీయాలకు అతీతంగా విపక్ష నేతలు, ఇతర పార్టీల అగ్ర నాయకులూ హాజరవుతారు. గతంలో రాహుల్, ఖర్గే కూడా హాజరయ్యారు. అయితే 2024 స్వాతంత్య్ర దిన వేడుకలకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన రాహుల్‌కు నియమాలకు విరుద్ధంగా చివరి నుంచి రెండో వరుసలో సీటు కేటాయించడం వివాదానికి దారి తీసింది. ఇది ప్రతిపక్షాన్ని, ప్రజలను అవమానించడమేనని కాంగ్రెస్ అభివర్ణించగా.. ఒలింపియన్లకు చోటు కల్పించేందుకే సీటింగ్ ఏర్పాట్లలో మార్పు చేయాల్సి వచ్చిందని రక్షణ శాఖ వాదించింది. ఎర్రకోటలో వేడుకలకు రాహుల్ హాజరుకాకపోవడంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాహుల్‌ది ‘దిమాగీ నక్సల్’ మనస్తత్వం అంటూ దుయ్యబట్టింది.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News