Share News

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ABN , Publish Date - Apr 26 , 2026 | 07:47 AM

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 26 ఏప్రిల్‌ - 2 మే 2026 (పి.ప్రసూనా రామన్‌)

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
Weekly Horoscopes

26 ఏప్రిల్‌ - 2 మే 2026

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgఆర్థిక స్థితి నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సాయం ఆశించి భంగపడతారు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. కొందరి రాక చికాకుపరుస్తుంది. చీటికిమాటికి చికాకు పడతారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgకార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం వసూలవు తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. వివాహయత్నాలు ఫలించే సూచనలున్నాయి. తాహతుకుమించి హామీలివ్వొద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgఅనుకున్న లక్ష్యం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్‌ ఫైనాన్సులలో మదుపు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రియతముల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పిల్లల దూకుడు కట్టడి చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgవ్యవహారానుకూలత ఉంది. ప్రతీ విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgశ్రమించినా ఫలితం శూన్యం. మీ సామర్థ్యంపై నమ్మకం సన్నగిల్లుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పుతో మెలగండి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. కొత్త సమస్య ఎదురవుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgరావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వం బలపడుతుంది. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. వాహన సౌఖ్యం, వస్తులాభం ఉన్నాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ఫోన్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgఅవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, అకాలభోజనం. అవకాశం చేజారిపోతుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. అందరితోనూ మితంగా సంభాషించండి. కొందరికి వ్యతిరేకులవుతారు. స్థిర, చరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgస్నేహ సంబంధాలు బలపడతాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. మధ్యవర్తులను నమ్మవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఆదాయం సంతృప్తికరం. మొండి బాకీలు వసూలవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. కార్యక్రమాలు ముందుకుసాగవు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలతో ఏకీభవించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgలావాదేవీలు కొలిక్కివస్తాయి. సమయోచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పరిచయాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. సాధ్యంకాని హామీలివ్వవద్దు. పోటీపరీక్షల్లో సంతానం మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgనిర్దేశిత లక్ష్యంతో ముందుకుసాగుతారు. అదృష్టం కలిసివస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రముఖుల ప్రమేయంతో వివాదం సద్దుమణుగుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అది త్యాగం కాదు.. ఎంపిక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2026 | 08:23 AM