10, 11 తేదీల్లో టీటీడీ ఇంజనీరింగ్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:25 AM
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
తిరుపతి(టీటీడీ), ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ర్టికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, ఇతర వివరాలకు టీటీడీ వెబ్‌సైట్ https: //ttdrecruitment.aponline.in/TTD Recruitment/Views/Dash board.aspx, 155257 కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.