Share News

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ నేతల ఫిర్యాదు

ABN , Publish Date - Apr 26 , 2026 | 06:07 AM

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ జిల్లా నేతలు కోరారు.

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ నేతల ఫిర్యాదు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ జిల్లా నేతలు కోరారు. ఈమేరకు శనివారం అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి విదేశీ శక్తులతో ఆయన చేయి కలిపారు. ఇలాంటి దుష్టులను చట్టపరంగా, బహిరంగంగా శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 26 , 2026 | 06:08 AM