తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల తేదీలు ఖరారు..
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:58 PM
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం రేపు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది.
తిరుమల, నవంబర్ 27: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం రేపు (శనివారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది. అలాగే నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదలకానుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల టికెట్ల చొప్పున రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
డిసెంబర్ 20వ తేదీ నుంచి 21వ తేదీ వైకుంఠ ద్వార దర్శనానికి కేవలం డిప్ విధానం ద్వారా భక్తులకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు డిప్ ద్వారా మొదటి రెండు రోజుల దర్శనం టోకెన్లను భక్తులకు టీటీడీ కేటాయించనుంది. మిగతా 8 రోజులు ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే వారికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనుంది. డిసెంబర్ 20, 21వ తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు దాతల దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి...
వారం రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడ మత్స్యకారులు
ఎన్టీఆర్ జిల్లాలో మళ్లీ పెద్దపులి జాడ.. మూడు రోజుల తర్వాత ట్రాకర్ సిగ్నల్స్
Read Latest AP News And Telugu News