కార్తీక మాసం వేళ.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:05 AM
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు (సోమవారం) నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
కార్తీక మాసం సందర్భంగా పవిత్ర గోదావరి నది తీరాన ప్రతి సోమవారం నదీహారతులను అర్చకులు నిర్వహించనున్నారు. రేపటి (మంగళవారం) నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ప్రతిరోజు మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఆలయ అర్చకులు జరిపించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News