వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:45 AM
వారఫలాలు.. 4 - 10 అక్టోబర్ 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలం. అను కున్నది సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మ కం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడ తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సంప్రదింపులు అర్ధాంతరంగా ముగుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. బంధువులతో విభేదిస్తారు. ఏ విషయాన్నీ సమస్యగా అనుకోవద్దు. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. మీ పక్కనే మోసగాళ్లుంటారని గమనించండి. శుభలేఖ అందుకుంటారు. తెగిపోయిన స్నేహబంధాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవు తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. మధ్యవర్తిత్వాలు, హమీలుతగవు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజే యండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. సన్నిహితులతో సంభాషిస్తారు.అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పెం పొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో అనుభవం గడిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ధనసహాయం తగదు. మీ ఇబ్బం దులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరు స్తాయి. ఏ విషయాన్నీ పట్టించుకోవద్దు. ఆలస్యంగానైనా పనులు పూర్తిచేస్తారు. మొండి బాకీలు వసూలు కావు. ఖర్చులు అంచనా లను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. మరోసారి యత్నిం చండి. వివాహయత్నం ఫలించే సూచనలు న్నాయి. నోటీసులు అందుకుంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధి స్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరు లపై ఆధారపడవద్దు. పరిచయాలు, బంధు త్వాలు బలపడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగు లోకి వస్తాయి. పనులు ఒక పట్టాన సాగవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగ వద్దు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ నిర్ణ యం వాయిదా వేయటం శ్రేయస్కరం. సామ రస్యంగా మెలగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతీ వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆహ్వానం అందుకుం టారు. తెగిపోయిన సంబంధాలు బలపడ తాయి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అన్నివిధాలా యోగదాయ కమే. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటా లకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వ స్వీకరణకు అనుకూలం. అందరి తోనూ కలుపుగోలుగా మెలగండి, పరిచయ స్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలు విరమిం చుకోవద్దు. పట్టుదలతోనే కార్యం సిద్థిస్తుంది. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ముఖ్యుల కలయిక సాధ్యపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. విందుకు హాజరవుతారు. పందాలు, బెట్టింగ్‌ల జోలికిపోవద్దు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. కొత్తయత్నాలు చేపడతారు. సాయం ఆశించవద్దు, కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరు స్తాయి. సంయమనం పాటించండి. విమర్శిం చిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆదాయం ఫర్వాలే దనిపిస్తుంది. కార్యక్రమాలు ముందుకుసాగవు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. వాహనం, ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త.
ఈ వార్తలు కూడా చదవండి:
జ్ఞానేశ్ ఉద్వాసనకు 10న దేశవ్యాప్త నిరసనలు
తండ్రి సూపర్ ఐడియా.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News