పాక్‌ను కొట్టేసి.. పసిడి పట్టేసి..
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:10 AM
ఆసియా గేమ్స్ క్రికెట్‌లో భారత జట్లదే సంపూర్ణ ఆధిపత్యం. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణంతో మెరిసింది. ఇదివరకే మహిళల జట్టు గోల్డ్ మెడల్ అందుకున్న...
ఫైనల్లో భారత్ విజయం
చెలరేగిన అభిషేక్, తిలక్
పాకిస్థాన్‌కు రజతం
శ్రీలంకకు కాంస్యం
నిస్సిన్: ఆసియా గేమ్స్ క్రికెట్‌లో భారత జట్లదే సంపూర్ణ ఆధిపత్యం. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణంతో మెరిసింది. ఇదివరకే మహిళల జట్టు గోల్డ్ మెడల్ అందుకున్న విషయం తెలిసిందే. చిరకాల శత్రువు పాకిస్థాన్‌తో శనివారం జరిగిన తుది పోరులో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ అభిషేక్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61), తిలక్ వర్మ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు. ఓడిన పాక్‌కు రజతం దక్కగా.. కాంస్య పోరులో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అరాఫత్, అహ్మద్ డానియల్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో పాక్ పోరాడి 20 ఓవర్లలో 192/6 పరుగులు చేయగలిగింది. హసన్ నవాజ్ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) ఒక్కడే దీటుగా ఆడాడు. అక్షర్, సుందర్, దూబేలకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆదుకున్న అభిషేక్, తిలక్: భారత్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఆరంభంలో.. డెత్ ఓవర్లలో తిలక్ విధ్వంసం కారణంగా జట్టు 200 స్కోరు దాటగలిగింది. వైభవ్ (15), శాంసన్ (2) విఫలమయ్యారు. శ్రేయాస్ (21), ఇషాన్ (20) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కానీ చివరి ఐదు ఓవర్లలో తిలక్ వర్మ జోరుకు జట్టు 74 పరుగులు రాబట్టింది. అతడికి దూబే (27) సహకరించాడు.
ఇక్కడా నో షేక్‌హ్యాండ్..: ఎప్పటిలాగే భారత్-పాక్ క్రికెటర్లు టాస్ సమయంలో, ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా కరచాలానికి దూరంగానే ఉన్నారు. భారత జట్టుకు ఐసీసీ చైర్మన్ జైషా స్వర్ణ పతకాలు అందజేయగా.. పాక్‌కు రజతం, శ్రీలంకకు కాంస్య పతకాలను ఆసియా గేమ్స్ నిర్వాహక కమిటీ సీనియర్ అధికార్లు బహూకరించారు.
స్కోరుబోర్డు
భారత్: వైభవ్ (సి) ఉస్మాన్ ఖాన్ (బి) సయీమ్ 15, అభిషేక్ (స్టంప్) ఉస్మాన్ ఖాన్ (బి) అరాఫత్ 61, శాంసన్ (సి) అరాఫత్ (బి) డానియల్ 2, శ్రేయాస్ (సి) ఫర్హాన్ (బి) అబ్రార్ 21, ఇషాన్ (బి) అరాఫత్ 20, తిలక్ (నాటౌట్) 51, దూబే (సి) సదాకత్ (బి) డానియల్ 27, అక్షర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 211/6. వికెట్ల పతనం: 1-28, 2-51, 3-93, 4-128, 5-133, 6-195. బౌలింగ్: సయీమ్ 4-0-47-1, సాద్ మసూద్ 3-0-33-0, డానియల్ 3-0-43-2, అరాఫత్ 3-0-25-2, అబ్రార్ 4-0-29-1, సుఫ్యాన్ 3-0-33-0.
పాకిస్థాన్: ఫర్హాన్ (సి) అక్షర్ (బి) సుందర్ 10, సదాకత్ (సి) సుందర్ (బి) అక్షర్ 23, ఉస్మాన్ (సి) దూబే (బి) అక్షర్ 3, నవాజ్ (సి) శాంసన్ (బి) దూబే 96, సయీమ్ (సి) సుందర్ (బి) దూబే 29, సమద్ (సి) తిలక్ (బి) సుందర్ 9, మసూద్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 192/6. వికెట్ల పతనం: 1-33, 2-36, 3-39, 4-126, 5-162, 6-192. బౌలింగ్: బుమ్రా 4-0-33-0, అక్షర్ 4-0-29-2, సుందర్ 4-0-29-2, బిష్ణోయ్ 3-0-44-0, అభిషేక్ 2-0-23-0, దూబే 3-0-33-2.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..
ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్