Share News

జ్ఞానేశ్‌ ఉద్వాసనకు 10న దేశవ్యాప్త నిరసనలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:07 AM

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ), తెలుగు రాష్ట్రాల డీవైఎఫ్ఐ నేతలు డిమాండ్‌ చేశారు.

జ్ఞానేశ్‌ ఉద్వాసనకు 10న దేశవ్యాప్త నిరసనలు

  • ఏఐఏడబ్ల్యూ, డీవైఎఫ్ఐ తెలుగు రాష్ట్రాల నేతలు వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ), తెలుగు రాష్ట్రాల డీవైఎఫ్ఐ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం ఏపీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో డీవైఎఫ్ఐ నేతలతో కలిసి ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ మాట్లాడుతూ.. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా కాగడాలతో నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. దేశమంతా ఛీకొడుతున్నా, ప్రజల్లో విశ్వాసం కోల్పోయినా జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంకా పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యవ్యవస్థను అవమానించడమేనని వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 04 , 2026 | 06:10 AM