Share News

పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు

ABN , Publish Date - Jun 26 , 2026 | 07:50 AM

దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు కలిగిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడు.. ఈ ఏడాది వినాయక చవితికి పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనమివ్వనున్నారు.

పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు
Khairatabad Ganesh

  • 69 అడుగుల ఎత్తు

  • 28 అడుగుల వెడల్పుతో విగ్రహ ఏర్పాటుకు అంకురార్పణ

హైదరాబాద్: దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు కలిగిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడు.. ఈ ఏడాది వినాయక చవితికి పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ సంవత్సరం పంచ భూతాల వల్ల మానవజాతికి ముప్పు సంక్రమించే అవకాశాలున్నందున సర్వ మానవాళి క్షేమం కోరుతూ వినాయకుడిని పంచముఖ సంకటహర మహా గణపతిగా పూజించనున్నామని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ వెల్లడించింది. ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విట్టలశర్మ సూచనల మేరకు గణపతి నమూనాను సిద్ధం చేసినట్లు తెలిపింది.


వినాయకుడి విగ్రహం ఎత్తును ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఈసారి 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో వినాయకుని మూర్తి ముస్తాబు కానుంది. అలాగే, మహా గణపతికి కుడి వైపున సోమనాథ్‌ జ్యోతిర్లింగం, ఎడమ వైపున కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక, ప్రతియేటా జ్యేష్ట శుక్ల ఏకాదశి నాడు గణపతి విగ్రహ తయారీ కోసం వేసే షెడ్డు పనులను కర్రపూజతో ప్రారంభిస్తారు.


ఈ ఏడాదికి సంబంధించిన కర్రపూజ పనులకు ఉత్సవ కమిటీ గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి రాజ్‌కుమార్‌, కన్వీనర్‌ సందీప్‏రాజ్‌, రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఉత్సవ కమిటీ అద్యక్షుడు, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, విగ్రహశిల్పి చినస్వామి రాజేంద్రన్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు

సైబర్‌ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 09:19 AM