Share News

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే..

ABN , Publish Date - Jun 26 , 2026 | 07:00 AM

తిరుమల శ్రీవారిని ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తిరుమల చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే..
Tirumala Temple

తిరుపతి: తిరుమల శ్రీవారిని ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సుభేందు సమంతా, తుహిన్ కుమార్ సహా ఐఏఎస్ అధికారి యువరాజ్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.


మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ సమీపం వరకు విస్తరించింది. అలాగే శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు, టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచిచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేటి రాశి ఫలాలు... ఎలా ఉన్నాయంటే...

రక్షణగిరిపై కరుణామయుడు

Updated Date - Jun 26 , 2026 | 07:06 AM