రక్షణగిరిపై కరుణామయుడు
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:47 AM
విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపాన రక్షణగిరిపై 32 అడుగుల ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కొండపై ఏటా క్రిస్మస్ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.
విశాఖలో 32 అడుగుల ఎత్తయిన క్రీస్తు విగ్రహం
విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపాన రక్షణగిరిపై 32 అడుగుల ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కొండపై ఏటా క్రిస్మస్ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ వందేళ్లు పైబడిన సెయింట్ పీటర్స్ చర్చి ఉంది. ఈ కొండపై నుంచి చూస్తే విశాఖలో అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. ఆ కరుణామయుడు ఈ నగరాన్ని చల్లగా చూడాలని కోరుతూ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు స్థానిక మాజీ కార్పొరేటర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తికావడానికి మరో రెండు నెలలు పడుతుందని, ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి