నేటి రాశి ఫలాలు... ఎలా ఉన్నాయంటే...
ABN , Publish Date - Jun 26 , 2026 | 01:45 AM
నేటి రాశిఫలాలు 26-06-2026, (శుక్రవారం)
నేటి రాశిఫలాలు 26-06-2026, (శుక్రవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
నిర్మాణ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లోపించడంతో ఆర్థికంగా చిక్కులు ఎదురవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు అందడంలో జాప్యం కావచ్చు. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
జన సంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. చర్చలు, ప్రయాణాల్లో నిదానం పాటించండి. ఖర్చులు అంచనాలు మించుతాయి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

మిథునం ( మే 21 - జూన్ 21 మధ్య జన్మించిన వారు)
విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్య సేవలకు అవసరమైన నిధులు అందుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురువుతుంది. శ్రీ దుర్గాష్టక పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. నిధుల విషయంలో తొందరపాటు తగదు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అమ్మవారిని ఆరాధించండి.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ ర ంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులు పట్టుదలతో పూరి చేస్తారు. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు. యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో కొంత నిదానం పాటించాలి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24-అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బోనస్‌లు, ఇంక్రి మెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురవుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లోపించడంతో ఇబ్బంది పడతారు. శ్రీ దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. నూతన భాగస్వామ్యాలు, కొత్త పనులు ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. లలితా దేవిని ఆరాధించండి.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించాలి. రాజకీయ, సినీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ దుర్గామాత ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్, క్యాటరింగ్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. లలితా పరమేశ్వరి ఆరాధన శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సమావేశాలు, వేడుకల్లో శ్రమాధిక్యం కలుగుతుంది. సినిమాలు, టెలివిజన్, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. గోసేవ శుభప్రదం
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ