వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:38 AM
ఈ వారం రాశిఫలాలు.. 21 -27 జూన్ 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. ధనలాభం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్, మధ్య వర్తులతో జాగ్రత్త. ప్రతీ విషయం స్వయంగా తెలుసుకోండి. అనాలోచిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మీదైన రంగంలో అభివృద్థి సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సమ ర్థతను చాటుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును తెలుసుకోండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించు కోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. వాహనం ఇతరులకివ్వవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కొంతమేరకు అనుకూలదా యకం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెట్టండి. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణుల సలహా పాటించండి. ఒంటెద్దు పోకడ తగదు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యసాధనకు మరింతగా శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగిం చండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. అందరితో మితంగా సంభాషించండి. ఇతరుల గురించి ప్రస్తావించవద్దు. పనుల ప్రారంభంలో ఆటం కాలెదురైనా పూర్తవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనురాగవాత్సల్యాలు వెల్లివిరు స్తాయి. సర్వత్రా ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన వార్త విం టారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహనిర్మాణానికి రుణం మంజూర వుతుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. అనుకోని సంఘటన ఎదురవుతుంది. అయినవారితో సంప్రదిం పులు జరుపుతారు. స్థిరచరాస్తుల వ్యవహా రంలో పునరాలోచన శ్రేయస్కరం.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
గ్రహాల సంచారం బాగుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉం చండి. పనులు పూర్తికావస్తున్న సమయంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ మాటకు తిరుగుండదు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయవ్యయాలు సంతృపి ్తకరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధన సహాయం తగదు. మీ ఇబ్బందులను సున్ని తంగా తెలియజేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల ఇంటర్వ్యూకోసం నిరీక్షణ తప్పదు. చిన్న విషయానికే చికాకు పడతారు. ఓర్పుతో మెలగండి. ఆప్తులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
పరిస్థితులు క్రమంగా చక్క బడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టు కుంటారు. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఇతరుల విష యంలో జోక్యం తగదు. మీ గౌరవానికి భం గం కలుగకుండా మెలగండి. ఆప్తులతో సంభా షణ ఉపశమనం కలిగిస్తుంది. లక్ష్యసాధనకు శ్రమిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయ వంతమవుతుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసేవారున్నారు జాగ్రత్త. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవ కాశం లభిస్తుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుం టారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సంతోషకరమైన వార్త విం టారు. మీ శ్రమ ఫలిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. విలాసాలకు వ్యయంచేస్తారు. మీ విషయాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశమివ్వవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మ వద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. చాక చక్యంగా వ్యవహరిస్తారు. యత్నాలకు సన్ని హితుల ప్రోత్సాహం ఉంటుంది. కొంత మొత్తం పొదుపుచేస్తారు. దూరపు బంధు వులతో సంభాషిస్తారు. గృహ మార్పు అని వార్యం. విలువైన వస్తువులు, పత్రాలుజాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం
Read Latest AP News And Telangana News And International News And Telugu News