స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:43 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం కొనాలనుకుంటున్నారా? అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలపడడం మొదలైన కారణాలతో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,080గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,33,900గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,230గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,34,050గా ఉంది. (Gold Rate live).
మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,55,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,50,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,55,000గా, బెంగళూరులో రూ.2,50,000గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..
ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..