Share News

జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:13 AM

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం

  • ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అక్షరం ప్రజల పక్షం. పాత్రికేయంతో సమాజహితం సిద్ధాంతంగా నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే జర్నలిజం ఆయనది. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే, కొత్త పలుకు వంటి వేదికల ద్వారా సమకాలీన అంశాలపై ప్రజలను ఆలోచింపజేస్తారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

హ్యాపీ బర్త్‌డే ఆర్కే సార్‌: లోకేశ్‌

‘ప్రజాపక్షమైన అక్షరం ఆంధ్రజ్యోతి దినపత్రిక... నిజాన్ని నిర్భీతిగా ప్రసారం చేసే దమ్మున్న చానల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘దశాబ్దాలుగా జనం కోసం, సమాజం కోసం జర్నలిజాన్ని నిలిపిన ఓపెన్‌ హార్ట్‌ రాధాకృష్ణ ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే ఆర్కే సార్‌’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 06:15 AM